మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ గురువారం 76వ పుట్టిన రోజును ఆయన స్వస్థలం చింద్వారాలో జరపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు చింద్వారాలోని కమల్‌నాథ్ ఇంటి వద్ద ముందస్తు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆలయాన్ని పోలిన ఓ కేక్‌ను కమల్‌నాథ్‌తో కట్ చేయించారు. దీంతో బిజెపి నేతలు కమల్‌నాథ్‌పై విరుచుకుపడుతున్నారు. ఇది హిందువులను అవమానించడం తప్ప మరోటి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.కమల్‌నాథ్ కట్ చేసిన కేకు ఆలయం ఆకారంలో ఉండడంతోపాటు పైన హనుమంతుడి బొమ్మ, కాషాయ జెండా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.