మళయాళ నటితో కానిస్టేబుల్​ అసభ్య ప్రవర్తన

By udayam on May 26th / 4:32 am IST

ప్రముఖ మళయాళ నటి, టీవి హోస్ట్​ అర్చనా కవితో ఓ కానిస్టేబుల్​ వ్యవహరించిన తీరుపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. తన స్నేహితులతో కలిసి ఆమె రాత్రి వేళ ఆటోలో వెళ్తుండగా వారితో కానిస్టేబుల్​ దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని నటి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేయడంతో పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసును సీరియస్​గా తీసుకున్న పోలీసులు అంతర్గత విచారణను వేగం చేశారు. ఆమె మాస్క్​ పెట్టుకోవడం వల్లే తాను గుర్తు పట్టలేదని కానిస్టేబుల్​ వివరణ ఇచ్చాడు.

ట్యాగ్స్​