చెన్నై : లాకప్​ డెత్​ కేసులో పోలీసులపై హత్య కేసు

By udayam on May 7th / 7:20 am IST

చెన్నై పోలీస్​ స్టేషన్​లో జరిగిన విఘ్నేష్​ అనే నిందితుడి లాకప్​ డెత్​పై ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. దీంతో పలువురు సీనియర్​ పోలీసుల్ని ప్రభుత్వం సస్పెండ్​ చేసింది. ఈ కేసును అనుమానాస్పద మృతిగా నమోదు చేసిన పోలీసులు.. ఇప్పుడు దానిని హత్య కేసుగా మార్చారు. పోస్ట్​ మార్టమ్​లో విఘ్నేష్​ శరీరంపై 13 చోట్ల తీవ్ర గాయాలు ఉన్నట్లు తేలింది. మత్తు మందు సరఫరా చేస్తున్నాడన్న అనుమానంతో అరెస్ట్​ అయిన విఘ్నేష్​ మరుసటి రోజునే లాకప్​ డెత్​ అయ్యాడు.

ట్యాగ్స్​