ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఎప్పుడూ ధృడంగా వ్యవహరిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. దాడి జరిగిన ప్రాంతం, తీవ్రతను అనుసరించి స్పందన ఉండబోదని అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన ”నో మనీ ఫర్ టెర్రర్” సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించారు.కొన్ని దేశాలు తమ విదేశాంగ విధానంలో భాగంగా ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నాయని పేరెత్తకుండానే పాకిస్థాన్ కు చురకలంటించారు. ఆ దేశాలు వారికి రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయని.. ఆ దేశాలపై ఆర్థిక ఆంక్షలు విధించాలని ప్రధాని సూచించారు.