భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగానికి 25 గంటల కౌంట్‌డౌన్‌ను బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించింది. గురువారం సాయంత్రం 6 గంటలకు మిషన్ కోడ్ నేమ్ PSLV-C53/DS-EO రాకెట్ సాయంతో సింగపూర్‌కు చెందిన 365 కేజీల డిఎస్ఈఓ, 155 కేజీల న్యూసార్ శాటిలైట్లతో పాటు 2.8 కేజీల స్కూబ్–1 నన్యంగ్ శాటిలైట్‌ను కక్ష్యలోకి చేర్చనుంది. వీటిని దక్షిణ కొరియాకు చెందిన స్టారెక్ సంస్థ అభివృద్ధి చేశాయి. ఈ పరీక్ష విజయవంతమైతే పిఎస్ఎల్ రాకెట్ ద్వారా 345 రాకెట్లు నింగిలోకి వెళ్ళినట్లవుతాయి.