30 శాతం తగ్గిన ఉప్పు ఉత్పత్తి

By udayam on May 11th / 12:20 pm IST

దేశంలో ఉప్పు ఉత్పత్తిలో భారీ లోటు కనిపిస్తోంది. దేశంలోనే అత్యధిక స్థాయిలో ఉప్పును ఉత్పత్తి చేసే గుజరాత్​లో గతేడాదితో పోల్చితే ఏకంగా 30 శాతం తక్కువగా ఉప్పు ఉత్పత్తి జరిగింది. నిజానికి ఉప్పు ఉత్పత్తి ప్రతీ ఏటా మార్చి నెల నుంచే ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈ ఏడాది సుదీర్ఘ కాలం పాటు కురిసిన వర్షాలకు ఈ సీజన్​ లేట్​గా మొదలైందని భారత సాల్ట్​ మాన్యుఫాక్చరర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ భారత్​ రావల్​ పేర్కొన్నారు.

ట్యాగ్స్​