కాంతారా ఫ్యాన్స్​ కు గుడ్​ న్యూస్​.. వరాహ రూపం పై బ్యాన్​ ఎత్తేసిన కోర్ట్​

By udayam on November 25th / 10:39 am IST

రిషబ్​ శెట్టి మూవీ కాంతారా ఫ్యాన్స్​ కు కోర్ట్​ గుడ్​ న్యూస్​ చెప్పింది. ఈ మూవీలో వాడిన వరాహ రూపం పాట తమదేనంటూ కోర్టుకెక్కిన కేరళ బ్యాండ్​ థైక్కుడం బ్రిడ్జ్ ప్లీ ని కేరళ కోర్ట్​ కొట్టేసింది. దీంతో ఈ పాట తిరిగి సినిమాలో భాగం కానుంది. నిన్నటి నుంచి అమెజాన్​ ప్రైమ్​ లో స్ట్రీమింగ్​ అవుతున్న ఈ మూవీ లో వరాహ రూపం పాట బదులు వేరే సాంగ్​ ను ప్లే చేస్తుండడంతో ఫ్యాన్స్​ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్స్​