చిన్నారుల కోసం కొవాగ్జిన్​కు అనుమతులు

By udayam on October 12th / 9:52 am IST

దేశవ్యాప్తంగా ఉన్న చిన్నారులను కొవిడ్​ నుంచి రక్షించడానికి కేంద్రం కొవాగ్జిన్​ వ్యాక్సిన్​కు అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. హైదరాబాద్​ సంస్థ భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన ఈ కొవాగ్జిన్​ను ఇటీవల చిన్నారులపై పరీక్షలు జరిపి ఆ డేటాను డిసిజిఎ కు సమర్పించారు. దీనిని పరిశీలించిన కేంద్ర నిపుణుల కమిటీ 2–17 ఏళ్ళ వయసు వారికి ఈ వ్యాక్సిన్​ను వినియోగించడానికి అత్యవసర అనుమతులు మంజూరు చేసింది. దేశంలో పిల్లల కోసం అనుమతులు పొందిన తొలి వ్యాక్సిన్​గా కొవాగ్జిన్​ నిలవనుంది.

ట్యాగ్స్​