షర్మిళ ఖమ్మం సభకు కరోనా దెబ్బ!

By udayam on April 6th / 1:22 pm IST

కరోనా కేసులు పెరుగుతుండడంతో ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి పార్టీ పేరు ప్రకటించాలని భావించిన వైఎస్​ షర్మిళకు ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఖమ్మంలో ఈనెల 9న జరగనున్న ఈ సభ గురించి ఇప్పటికే ఖమ్మం పోలీసులు ఆర్గనైజర్లకు జిఓ 68, 69 ప్రకారం నోటీసులు జారీ చేశారు. దీనికి స్పందించిన ఆర్గనైజర్లు సభను కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగానే జరుపుతామని పోలీసులకు తెలిపారు. ఈ సభలో పార్టీ పేరు, పార్టీ సింబల్​, పార్టీ నిబంధనల్ని షర్మిళ ప్రకటించే అవకాశం ఉంది.

ట్యాగ్స్​