భారత్ తన పొరుగు మిత్రదేశాలైన భూటాన్, బంగ్లాదేశ్‌లకు ఇక్కడ తయారవుతున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించి తన ఔదార్యాన్ని మరోసారి ప్రదర్శించింది.
ఈ విషయాన్ని మన దేశంలో పర్యటిస్తున్న భూటాన్ ప్రధాని లోతే షెరింగ్ వెల్లడించారు. ఆక్స్ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా సంస్థలు ఇక్కడి సీరమ్ ఇన్స్టిట్యూట్ లో ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ భూటాన్ దేశ ప్రజలందరికీ ఉచితంగా అందించడానికి భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
దాంతో పాటు మరో పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌కు సైతం ఈ వ్యాక్సిన్‌ను దాదాపు 2 మిలియన్ డోసులు అంటే 20 లక్షల టీకాలు ఉచితంగా అందించడానికి ముందుకు వచ్చినట్లు ప్రధాని లోతే షెరింగ్ పేర్కొన్నారు.
ఒకవేళ మేం గనుక ఈ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే భారత్ కు 6 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి వచ్చేంది. మేం మా దేశ ప్రజలలో అవసరమైన వారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్నాం అని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. వారు మా పరిస్థితిని అర్ధం చేసుకున్నారు. అందుకే ఉచితంగా పంపిణీ చేయడానికి ముందుకొచ్చారు లోతే షెరింగ్ వెల్లడించారు.