హామీ రాకపోతే సిఎం ఇంటి ముట్టడి

By udayam on August 19th / 8:55 am IST

ఓపీఎస్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే.. సెప్టెంబరు 1న తలపెట్టిన ముఖ్యమంత్రి ఇంటి ముట్టడి, విజయవాడలో మిలియన్‌ మార్చ్‌, బహిరంగ సభ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తామని సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. ఎన్నికల ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ మోహ‌న్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి, ఓపీఎస్‌ను అమల్లోకి తెస్తామని విస్పష్టమైన ప్రకటన చేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గ్యారంటీ పింఛను పథకం.. జీపీఎస్‌పై చర్చకు కూడా తాము సిద్ధంగా లేమని.. సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని.. ఓపీఎస్‌ అమల్లోకి తేవాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు స్ప‌ష్టం చేశాయి. సీపీఎస్‌ అంశంపై వివిధ ఉద్యోగ సంఘాల నాయకులతో మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక, సాధారణ పరిపాలన శాఖల ఉన్నతాధికారులు సుదీర్ఘ చర్చలు జరిపారు. ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు ఎవరి వాదనకు వారు కట్టుబడటంతో ప్రతిష్టంభన వీడలేదు. జీపీఎస్‌ అంశంపై చర్చించేందుకైతే తాము రాబోమని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

ట్యాగ్స్​