యుపి: కన్వరిగంజ్​ లో 50 ఇళ్ళకు భారీ పగుళ్ళు..

By udayam on January 11th / 7:03 am IST

ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో మాదిరిగా యుపిలోనూ కొన్ని భవనాలకు పగుళ్లు ఏర్పడ్డాయి. బుధవారం అలీఘర్‌లోని కన్వరిగంజ్‌ ప్రాంతంలో దాదాపు 50 ఇళ్లకు అకస్మాత్తుగా పగుళ్లు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే ఇది జాతీయ విపత్తు కాదని.. స్మార్ట్‌ సిటీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన పైప్‌లైన్‌ లీకేజ్‌ కావడంతో పగుళ్లు ఏర్పడ్డాయని అధికారులు పేర్కొన్నారు. అయితే స్థానికులు మాత్రం ఇళ్ళు కూలిపోతాయోనని భయపడుతున్నారు.

ట్యాగ్స్​