రూ.33 లక్షలు విరాళం ఇచ్చిన క్రికెట్​ ఆస్ట్రేలియా

By udayam on May 3rd / 8:18 am IST

క్రికెట్​ ఆస్ట్రేలియా భారత్​కు 50 వేల డాలర్లను విరాళంగా అందించింది. కరోనా కష్ట సమయంలో వీటిని వినియోగించాలని సూచించింది. ‘ఆస్ట్రేలియా ప్రజలకు భారత్​తో విడదీయలేని బంధం ఉంది. అందులో క్రికెట్​ కూడా ఒకటి. ప్రస్తుత భారత పరిస్థితిని చూస్తుంటే ప్రతి ఒక్కరి ఆస్ట్రేలియా గుండె కరుగుతోంది. మా వంతుగా 50 వేల డాలర్లు (రూ.33 లక్షలు) విరాళంగా ఇస్తున్నాం. కరోనా సమయంలో ఈ మొత్తం కొందరికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం’ అని క్రికెట్​ ఆస్ట్రేలియా ఓ ప్రకటన విడుదల చేసింది.

ట్యాగ్స్​