భారత్ తర్వాత దేశవాళీ క్రికెట్ టోర్నీల ప్రసారాలను బిలియన్ డాలర్లకు పైగా అమ్మిన దేశంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది. ఆ దేశంలో జరిగే దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లను ప్రసారం చేసేందుకు గానూ స్థానిక ఫాక్స్ టెల్ గ్రూప్, సెవెన్ వెస్ట్ మీడియా సంస్థలతో క్రికెట్ ఆస్ట్రేలియా 1.2 బిలియన్ డాలర్లు (1.5 ఆస్ట్రేలియా బిలియన్ల) ఒప్పందాన్ని ఈరోజు ఖరారు చేసుకుంది. ఆ దేశంలో జరిగే టెస్టులు, వన్డేలు, టి20లతో పాటు బిగ్ బాష్ లీగ్ కూడా ఇకపై ఈ ఛానల్స్ లోనే ప్రసారం కానుంది.