రోడ్డు ప్రమాదంలో గాయపడిన టీం ఇండియా క్రికెటర్ రిషబ్ పంత్ ను డెహ్రాడూన్ నుండి ముంబై హాస్పటల్ కు తరలిస్తున్నారు. గత శుక్రవారం పంత్ నడుపుతున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురవడం తెలిసిందే. మోకాలులో లిగమెంట్ కట్ అయిపోవడంతోపాటు, నుదురు, వీపుపై గాయాలయ్యాయి. అప్పటి నుంచి అతడికి డెహ్రాడూన్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం పంత్ ను ముంబైలోని ఓ ఆసుపత్రికి తరలించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.