పోర్చుగల్ తరపున కెరీర్ లో 5వ వరల్డ్ కప్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్ బాల్ దిగ్గజ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. నిన్న రాత్రి ఖతర్ లో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ కు ముందు జాతీయ గీతాలాపన సమయంలో అతడు కన్నీళ్ళు పెట్టుకున్నాడు. దేశానికి ఆడడం కంటే ఓ ప్లేయర్ కు మరో గొప్ప విషయం ఏదీ ఉండదని అతడి అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఘనాతో జరిగిన నిన్నటి మ్యాచ్ లో పోర్చుగల్ 2–1 తేడాతో విజయం సాధించింది.
Cristiano Ronaldo's tears while chanting the anthem 🥹#PORGHA | #FIFAWorldCup
pic.twitter.com/9zpm4HVnXL— 🆉🅸🆉🅾🆄 (@zi_46) November 24, 2022