గత నెలలో వివాదాస్పద ఇంటర్వ్యూ ఇచ్చి మాంచెస్టర్ యునైటెడ్ జట్టును వీడిన ఫుట్ బాల్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అల్ నజర్ తో చేతులు కలిపాడు. ఏకంగా రెండున్నరేళ్ళ పాటు ఈ జట్టుతో ఆడతానని ఒప్పందం చేసుకున్న రొనాల్డో అందుకు గానూ ఏడాదికి రూ.1770 కోట్లను ఫీజుగా తీసుకోనున్నాడు. ఈ మొత్తం మాంచెస్టర్ లో దక్కిన దానికంటే చాలా ఎక్కువ. రొనాల్డోతో మంచెస్టర్ కు పొసగడం లేదన్న వార్తలు బయటకు రాగానే.. సౌదీ నుంచి రొనాల్డో కు ఓపెన్ ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే.