మాంచెస్టర్​ నుంచి బయటకొచ్చేసిన రొనాల్డో

By udayam on November 24th / 10:45 am IST

ఫిఫా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో తన తొలి మ్యాచ్‌‌‌‌కు ముందే పోర్చుగల్‌‌‌‌ లెజెండ్‌‌‌‌ క్రిస్టియానో రొనాల్డోకు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫుట్​ బాల్​ క్లబ్​ మాంచెస్టర్​ యునైటెడ్​ నుంచి అతడు బయటకు వచ్చేశాడు.పరస్పర అంగీకారంతో కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్టు మాంచెస్టర్‌‌‌‌ ప్రకటించింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. రొనాల్డో సైతం ఈ విషయాన్ని ధృవీకరించాడు. మాంచెస్టర్‌‌‌‌తో చర్చించి కాంట్రాక్ట్‌‌‌‌ను ముందుగానే ముగించుకోవాలని అంగీకరించామని చెప్పాడు. కొద్దిరోజులుగా ఆ జట్టు కోచ్​ కు, రొనాల్డోకు బహిరంగంగానే మాటల యుద్ధం జరుగుతుండడం తెలిసిందే. 003 నుంచి 2009 వరకు మాంచెస్టర్‌‌‌‌ టీమ్‌‌‌‌లో సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌గా వెలిగిన రొనాల్డో ఆ తర్వాత వేరే క్లబ్​ కు మారి.. 2021 లో తిరిగి మాంచెస్టర్​ కు వచ్చాడు.

ట్యాగ్స్​