నడి సంద్రంలో వారం పాటు చిక్కుకుపోయిన నౌక

By udayam on January 3rd / 6:20 am IST

విలాసవంతమైన న్యూ ఇయర్ విహారయాత్ర నౌక సముద్ర జలాల్లో చిక్కుకుపోవడంతో అందులోని ప్రయాణికులకు వారం రోజులపాటు భయంకరమైన అనుభవం ఎదురైంది. వైకింగ్​ అరియన్​ అనే నౌక అడుగున ముందు భాగంలో సముద్ర జలాల్లోని సూక్ష్మజీవుల్లాంటి జీవ వృథా పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో ఈ నౌకకు మూడు రేవుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య అంతర్జాతీయ సముద్ర జలాల్లో అడిలైడ్ సమీపంలో నౌక నిలిచిపోయింది. బయోఫౌల్​ వ్యర్థాలను తొలగించిన తర్వాతే ఈరోజే ఈ నౌకకు తీరానికి వచ్చేందుకు అనుమతులు ఇచ్చారు.

ట్యాగ్స్​