ధోనీ రాకతో చెన్నై జోష్​..

By udayam on May 2nd / 5:58 am IST

ధోనీ తిరిగి చెన్నై పగ్గాలు అందుకున్న వెంటనే ఆ జట్టులో జోష్​ కనిపించింది. సూపర్​ ఫామ్​లో ఉన్న హైదరాబాద్​ను మట్టికరిపించి ఆదివారం మ్యాచ్​లో విజయాన్ని ఎగురేసుకుపోయింది. ముందు బ్యాటింగ్​ చేసిన చెన్నైలో గైక్వాడ్​ 99, కాన్వే 85 రాణించడంతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది. ఆపై ఛేదనకు దిగిన సన్​రైజర్స్​ చివరి వరకూ పోరాడి చేతులెత్తేసింది. విలియమ్సన్​ 47, పూరన్​ 64, అభిషేక్​ 39 పరుగులు చేసినా ఫలితం దక్కలేదు. చెన్నై బౌలర్​ చౌదరి 4 వికెట్లు తీశాడు.

ట్యాగ్స్​