ఈద్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో చెలరేగిన మత ఘర్షణల్లో ఇప్పటి వరకూ 97 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులుతెలిపారు. గత సోమవారం నాడు రంజాన్, పరశురామ జయంతి పర్వదినాల సందర్భంగా రెండు మతాలకు చెందిన వర్గాలు వేరే మతాల జెండాలను తొలగించడంతో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో పోలీసులు ఇంటర్నెట్ను బంద్ చేసి కర్ఫ్యూ అమలు చేశారు. సిఎం అశోక్ గెహ్లాట్సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసి పరిస్థితులను దగ్గరుండి సమీక్షించారు.