రూ కోటి కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ

By udayam on October 27th / 6:21 am IST

హైదరాబాద్‌: దసరా ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ గద్వాల్‌లోని వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో దుర్గమాతను కరెన్సీ నోట్లతో అలంకరించారు. వీటి విలువ అక్షరాలా కోటీ రుపాయలు.

భారతీయ‌ కరెన్సీ నోట్లను కాగితపు పువ్వులలాగా తయారు చేసి వాటిని దుర్గమాతకు సమర్పించారు. 10, 20, 100, 200, 500 వంటి వివిధ రకాల నోట్లతో దండలు, పుష్పగుచ్ఛాలుగా తయారు చేసి మొత్తం 1,11,11,111 రూపాయలను ధనలక్ష్మీ అవతారంలో అమ్మవారికి అలంకరించారు.

ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కోటి రుపాయల మొత్తాన్ని ఇలా అమ్మవారికి సమర్పించడం భక్తులు ఆశ్చార్యానికి లోనవుతున్నారు. అయితే మూడేళ్ల క్రితం అదే ఆలయంలో అమ్మవారికి 3,33,33,333 కోట్ల రూపాయల విలవైన కరెన్సీని ఉపయోగించి అలంకరించారు.

రెండేళ్ల క్రితం కిలో బంగారు కిరీటం కూడా సమర్పించారు. తాజాగా కోటి రూపాయల అలంకరణకు సంబంధించిన వీడియో ఓ మహిళా జర్నలిస్టు ట్విటర్‌లో షేర్‌ చేయడంతో సోషల్‌ మీడియా పిక్స్ వైరల్ అవుతున్నాయి.