వేసవికి వాయిదా పడ్డ కస్టడీ రిలీజ్​ డేట్​

By udayam on December 29th / 11:24 am IST

నాగచైతన్య కొత్త చిత్రం కస్టడీ రిలీజ్​ డేట్​ ను మేకర్స్​ రివీల్ చేశారు. వచ్చే ఏడాది మే 12న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్​ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్​ కంప్లీట్​ అయిన ఈ మూవీని అప్పటి వరకూ రిలీజ్​ చేయకపోవడం ఏంటా? అని ఫ్యాన్స్​ ట్వీట్లు చేస్తున్నారు. కోలీవుడ్​ డైరెక్టర్​ వెంకట్​ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్​. ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మ్యాస్ట్రో యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్స్​