అసాని తుపాను ప్రభావం తీవ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో 37 రైళ్ళను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–నర్సాపూర్, నర్సాపూర్–నిడదవోలు, నిడదవోలు–భీమవరం జంక్షన్, మచిలీపట్నం–గుడివాడ, భీమవరం–మచిలీపట్నం, భీమవరం–విజయవాడ, గుంటూరు–నర్సాపూర్, గుడివాడ–మచిలీపట్నం, కాకినాడ పోర్ట్–విజయవాడ మార్గాల్లో ప్రయాణించే రైళ్ళ సర్వీసులను రద్దు చేసినట్లు ప్రకటించింది.