కాకినాడ వద్ద తీరం దాటిన తుఫాను

By udayam on May 11th / 7:16 am IST

అసాని తుఫాను ఆంధ్రప్రదేశ్​లోని కాకినాడ వద్ద తీరం దాటింది. దీంతో కాకినాడతో పాటు రాజమండ్రి, అమలాపురం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పాడ బీచ్​ రోడ్డు దారుణంగా దెబ్బతింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణాలను నిలిపివేశారు. ఈ సాయంత్రానికి ఇది నర్సాపూర్​, యానాం, తుని, విశాఖపట్నం తీరాలకు చేరి అనంతరం మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈరోజు రాత్రికి పశ్చిమ బంగాళాఖాతానికి చేరుకుంటుందని తెలిపింది.

ట్యాగ్స్​