ఆంధ్రప్రదేశ్, ఒడిశా అధికారులను హడలెత్తించిన అసని తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. మచిలీపట్నం తీరం వద్దే గత కొద్ది గంటలుగా నిలకడగా ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 45–55 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.