మరో 6 గంటలు ‘గులాబ్​’ ప్రభావం

By udayam on September 27th / 6:13 am IST

కళింగపట్నం వద్ద తీరం దాటిన తీవ్ర తుపాను ‘గులాబ్​’ ప్రబావం మరో 6 గంటల పాటు కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఎపిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. ఒడిశాలోని గంజాం, గజపతి జిల్లాలను సైతం ఈ భారీ తుపాను తీవ్రంగా దెబ్బకొట్టింది. తుపాను పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఎపి సిఎం జగన్​మోహన్​ రెడ్డి, ఒడిశా సిఎం నవీన్​ పట్నాయక్​లతో చర్చించారు.

ట్యాగ్స్​