‘గులాబ్​’ ధాటికి 3 గురు మృతి

By udayam on September 27th / 6:46 am IST

అత్యంత తీవ్ర తుపాను గులాబ్​ ధాటికి ఆంధ్రప్రదేశ్​, ఒడిశాలో 3 గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఒక మత్స్యకారుడు సైతం గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ తుపాను ప్రభావం ఇప్పటికే తగ్గుముఖం పట్టగా ఇది మిగిల్చిన విషాదం తాలూకు ఫలితాలు వెల్లడవుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు మత్స్యకారులు మరణించారు. ఒడిశాలోని గుంజాం జిల్లాలో మరొక మత్స్యకారుడు మరణించారు. తుపాను సమయంలో సముద్రంలో వేటకు వెళ్ళిన శ్రీకాకుళానికి చెందిన ఓ మత్స్యకారుడు బోటు తిరగబడడంతో సముద్రంలో గల్లంతయ్యాడు.

ట్యాగ్స్​