అండమాన్​ సముద్రంలో తుపాను సూచనలు

By udayam on May 5th / 9:43 am IST

దక్షిణ అండమాన్​ సముద్రంపై తుపాను ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 6 నాటికి అల్పపీడనం ఏర్పడితే అది తుపానుగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపింది. ఒకవేళ తుపాను గనుక వస్తే దానిని ‘సైక్లోన్​ అసాని’గా పిలవనున్నట్లు చెప్పిన వాతావరణ శాఖ ఈ అసాని పేరును శ్రీలంక సూచించినట్లు పేర్కొంది. మే 10 నాటికి తుపాను తీవ్రరూపం దాల్చి తీరం దాటే అవకాశాలు ఉంటాయని పేర్కొంది.

ట్యాగ్స్​