అయ్యప్ప పుట్టుకపై భైరి నరేష్​ వివాదాస్పద వ్యాఖ్యలు..

By udayam on December 31st / 6:05 am IST

భారత నాస్తిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భైరి నరేష్‌.. అయ్యప్ప పుట్టుకపై చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర కలకలం రేపాయి. అతడి వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా వీహెచ్‌పీ, అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలుజిల్లాలో అయ్యప్పస్వాములు, వీహెచ్‌పీ, భజరంగ్‌దల్‌, బీజేపీ నేతలు నడిరోడ్డుపై ధర్నాలు చేశారు. నరేశ్‌ స్పీచ్‌ను సమర్థించిన యూట్యూబర్‌ బాలరాజును పట్టుకుని చితకబాదారు. అయ్యప్ప జననంపై జుగుప్సాకర కామెంట్స్‌ చేసిన భైరి నరేష్‌పై పలు పోలీస్‌స్టేషన్‌లో 153A, 295A, 298, 505 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

ట్యాగ్స్​