కొవిడ్​ బారిన మరో ఆర్సీబి ప్లేయర్​

By udayam on April 7th / 7:35 am IST

ఐపిఎల్​ సీజన్​ 14 ప్రారంభం కావడానికి కేవలం రెండు రోజులే ఉన్న సమయంలో ఆర్సీబీ ప్లేయర్​, ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ డానియల్​ శామ్స్​ కొవిడ్​ బారిన పడ్డాడు. టోర్నీ తొలిరోజు శుక్రవారమే బెంగళూరు, పటిష్ట ముంబైతో తొలి మ్యాచ్​ను ఆడనుండగా ఆ జట్టుకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు జట్టు ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​ సైతం కరోనా బారిన పడగా ఇప్పుడు శామ్స్​ వంతు వచ్చింది. ప్రస్తుతం అతడికి ఎలాంటి లక్షణాలు లేవని ఆర్సీబి ట్వీట్​ చేసింది.

ట్యాగ్స్​