ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డేనియల్ వెటోరి ఎంపికయ్యాడు. టెస్టుల్లో 113 మ్యాచ్ లు ఆడిన వెటోరీ అందులో 19 మ్యాచ్‌లను ఆస్ట్రేలియాలోనే ఆడిన అనుభవం ఉంది. దీంతో పాటు ఐపిఎల్, బిగ్‌బాష్, ఇంగ్లాండ్, కరేబియన్ లీగుల్లోనూ అతడు కోచ్‌గా సేవలందించాడు. గతంలో ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా పనిచేసిన అనుభవం సైతం అతడి సొంతం. వెటోరీతో పాటు ఆండ్రే బొరొవిక్ను సైతం ఎంపిక చేశారు.
2️⃣ new assistant coaches for our men's national team!
Welcome Andre & Daniel 🤝 pic.twitter.com/YLrcQj9LRE
— Cricket Australia (@CricketAus) May 24, 2022