ఐపిఎల్ కొత్త జట్టు గుజరాత్ లయన్స్ తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో గెలుపొంది ఫైనల్స్‌లోకి దూసుకుపోయింది. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 189 పరుగుల లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్‌కు బట్లర్ 89, సంజు శాంసన్ 47 రాణించడంతో 188 పరుగులు చేసింది. ఆపై డేవిడ్ మిల్లర్ 38 బాల్స్‌లో 68* విధ్వంసకర బ్యాటింగ్‌కు హార్ధిక్ (40*) తోడై మ్యాచ్‌ను గుజరాత్ గెలుచుకుంది. వేడ్ 35, గిల్ 35తో రాణించారు.