ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ టెస్టుల్లో చరిత్ర సృష్టించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ లో (వార్నర్ కు కెరీర్లో 100వ ది) డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 254 బాల్స్ లోనే అతడు 78 స్ట్రైక్ రేట్ తో డబుల్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్ లో 16 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. డబుల్ సెంచరీ కొట్టిన వెంటనే వార్నర్ కాలి నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. స్టీవ్ స్మిత్ 85 పరుగుల వద్ద ఔట్ అవ్వడంతో సెంచరీని చేజార్చుకున్నాడు.