పాక్లో ఉంటున్న భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం.. భారత్లో ఉంటున్న అతడి బంధువులకు నెలకు రూ.10 లక్షల భత్యాన్ని పంపిస్తున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఎన్సిపి మంత్రి నవాబ్ మాలిక్ కేసులో విచారణ సందర్భంగా సాక్షిగా ఉన్న ఖాలిద్ ఉస్మాన్ షేక్ ఈ వివరాల్ని బయటపెట్టాడు. దావూద్ బంధువు ఇక్బాల్ కస్కర్, అతడి మనుషుల ద్వారా ప్రతీనెలా ఖచ్చితంగా మాకు ఆ డబ్బు అందుతుంది. ప్రత్యేక సందర్భాల్లో మరింత ఎక్కువ కూడా మాకు వస్తుంది’ అని సాక్షి తెలిపాడు.