తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ తన దావోస్ పర్యటనను ఘనంగా ప్రారంభించారు. తొలిరోజు పర్యటనలో భాగంగా ఆయన రూ.600 కోట్ల పెట్టుబడులను తెలంగాణకు సాధించారు. లులు గ్రూప్ తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో రూ.500 కోట్లను పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. దీంతో పాటు స్పెయిన్కు చెందిన కెమో ఫార్మా తెలంగాణలో వచ్చే 2 ఏళ్ళలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెడతామని ఎంఓయూ కుదుర్చుకుంది.