చనిపోయిన వ్యక్తికి రెండు డోసుల వ్యాక్సిన్​!

By udayam on September 14th / 5:21 am IST

బతికున్న వారే వ్యాక్సిన్​ తీసుకోవడానికి నానా కష్టాలు పడుతున్న ఈ రోజుల్లో చనిపోయిన వ్యక్తికి అనంతపురంలో 2 డోసుల వ్యాక్సిన్​ వేశారు!! అదెలా అంటారా అనంతపురంలో జులైలో చనిపోయిన వ్యక్తి ఇటీవల కాలంలో కొవిడ్​ వ్యాక్సిన్లు వేయించుకున్నట్లు అతడి కొడుకు సెల్​కు మెసేజ్​లు వచ్చాయి. దీనిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి పేరుతో ఎవరో ఈ వ్యాక్సిన్లను వేయించుకున్నా ఆరోగ్య శాఖ అధికారులు పట్టించుకోవట్లేదని విమర్శించారు.

ట్యాగ్స్​