వరుస పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్ధాద్​

వరుస ఆత్మాహుతి దాడులు

28 మంది మృతి - 73 మందికి గాయాలు

By udayam on January 21st / 11:19 am IST

ఇరాన్​ రాజధాని బాగ్ధాద్​ వరుస ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. ఈ దాడుల్లో 28 మంది అమాయకులు చనిపోగా 73 మందికి గాయాలయినట్లు తెలుస్తోంది.

బాగ్ధాద్​కు నడిబొడ్డున ఉన్న అత్యంత రద్దీ ప్రాంతమైన కమర్షియల్​ స్ట్రీట్​లో ఈ ఆత్మాహుతి దాడులు జరగడం వల్ల ప్రాణనష్టం అధికంగా ఉన్నట్లు ఆ దేశ మిలటరీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

దాడులు ఎక్కడ జరిగాయి?

అత్యంత రద్దీగా ఉండే బాబ్​ అల్​ షర్జి ప్రాంతంలో ఈ వరుస ఆత్మాహుతి దాడులు జరిగినట్లు ఆ దేశ బ్రిగేడియర్​ జనరల్​ హజీమ్​ అల్​ అజావి వెల్లడించారు.

ప్రజల మధ్య నుంచే నడుచుకు వెళ్ళిన ఆత్మాహుతి సభ్యులు బాబ్​ అల్​ షర్జి ప్రాంతంలోని సెకండ్​ హ్యాండ్​ దుస్తుల దుకాణం ఉండే తయారన్​ స్క్వేర్​ వద్ద తమను తాము పేల్చేసుకున్నారని మిలటరీ ప్రతినిధి యహ్య రసూల్​ వెల్లడించారు.

దీంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై భయం గొలుపుతోందని స్థానిక ఎఎఫ్​పి న్యూస్​ వార్తను ప్రచురించింది. దాడి జరిగిన వెంటనే రక్షణ చర్యలు మొదలుపెట్టినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది.