బీహార్‌లోని చాప్రాలో ‘కల్తీ సారా’ తాగిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 50కి పెరిగింది. సరణ్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలోగల ఇసాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి ‘కల్తీ సారా’ తాగిన కొందరి ఆరోగ్యం విషమించింది. వారిని చాప్రాలోని సదర్ ఆసుపత్రికి తరలించారు.చికిత్స పొందుతూ మంగళవారం ఒక్కరోజే సుమారు 26 మంది చనిపోయారు. ఆ తరువాత కూడా మృతుల సంఖ్య పెరిగింది. ఈ మరణాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సిఎం ఖండించారు. ‘సారా తాగితే చస్తారు’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో దుమారం రేపాయి.