అస్సాం వరదలు : 24కు చేరిన మృతులు

By udayam on May 23rd / 8:56 am IST

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తడంతో ఇప్పటి వరకూ 24 మంది దుర్మరణం చెందారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 7 లక్షల మంది ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. మొత్తంగా 2248 గ్రామాలు వరద నీటిలో చిక్కకుకున్నాయి. ప్రజల కోసం రాష్ట్రవ్యాప్తంగా 496 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి 75 వేల మందికి ఆహారాన్ని ప్రభుత్వం అందిస్తోంది.

ట్యాగ్స్​