ద్రవిడ్​ చెప్పడం వల్లే : చాహర్​

By udayam on July 21st / 8:05 am IST

శ్రీలంక తో జరిగిన 2వ వన్డేలో సంచలన ప్రదర్శన చేసిన దీపక్​ చాహర్​ ఆరోజు బ్యాటింగ్​కు వెళ్ళే ముందు కోచ్​ ద్రవిడ్​ చెప్పిన మాటల వల్లే తాను ఈ ఇన్నింగ్స్​ ఆడగలిగానని వివరించాడు. ‘ప్రతి బాల్​ను ఆడుతూ ఉండు. ఎక్కువ సమయం క్రీజులో ఉండు. ఆ తర్వాత ఎలా ఆడాలో నీకు తెలుస్తుంది’ అని ద్రవిడ్​ చెప్పాడని చాహర్​ వివరించాడు. 8వ వికెట్​గా బ్యాటింగ్​కు దిగి 69 పరుగులు చేసిన చాహర్​ భారత్​ తరుపున ఆ వికెట్​కు 2వ అత్యధిక పరుగుల వీరుడు. అతడి కంటే ముందు జడేజా 77 పరుగులతో ఉన్నాడు.

ట్యాగ్స్​