ఘనంగా క్రికెటర్​ దీపక్​ చహర్​ వివాహం

By udayam on June 2nd / 6:16 am IST

టీమిండియా స్టార్​ క్రికెటర్​ దీపక్​ చహర్​ పెళ్ళి ఘనంగా జరిగింది. బుధవారం జరిగిన ఈ వివాహ వేడుకలో తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్​తో కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్​ సమక్షంలో మూడు ముళ్ళ బంధంలోకి అడుగుపెట్టాడు. పెళ్లి అనంతరం ఫొటోలను క్రికెటర్​ ఇన్​స్టాగ్రామ్​, ట్విట్టర్​ వేదికగా షేర్​ చేశాడు. జయా భరద్వాజ్​ ఢిల్లీ ఎన్​సిఆర్​లో కార్పొరేట్​ మేనేజర్​గా ఉద్యోగం చేస్తోంది. ఈరోజు ఐటీసీ మైర్య హోటల్​లో వీరిద్దరి రిసెప్షన్​ వేడుకను నిర్వహించనున్నారు.

ట్యాగ్స్​