చైనాతో ఉద్రిక్తతలు: రూ.84 వేల కోట్లతో అధునాతన ఆయుధాలు కొంటున్న భారత్​

By udayam on December 23rd / 12:38 pm IST

సరిహద్దులో చైనాతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత సైన్యం తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోనుంది. త్వరితగతిన భారీగా ఆయుధాలు కొనుగోలు చేయడానికి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఏకంగా రూ.84,328 కోట్లతో ఆయుధాలు, ఇతర రక్షణ సామగ్రిని కొనుగోలు చేయాలని నిర్ణయించింది. లైట్ ట్యాంకులు, ఫ్యూచరిస్టిక్ పోరాట వాహనాలు, మౌంటెడ్ గన్ సిస్టమ్స్, క్షిపణులు, బాంబులతో సహా కొత్త మిలిటరీ హార్డ్ వేర్‌తో భారత సాయుధ దళాల పోరాట సామర్థ్యాన్ని పెంపొందించేందుకు రక్షణ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది.

ట్యాగ్స్​
IAF