వరుసగా 5 విజయాల తర్వాత సన్రైజర్స్ హ్యాట్రిక్ ఓటముల్ని నమోదు చేసుకుంది. నిన్న రాత్రి ఢిల్లీ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. దీంతో 21 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది. హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఢిల్లీ తరపున 92 పరుగులు చేసి హైదరాబాద్ ఓటమికి పూర్తి బాధ్యుడయ్యాడు. అతడికి పొవెల్ 67 తో జతయ్యాడు. ఆపై సన్రైజర్స్ ఛేదనలో పూర్తిగా విఫలమైంది. మరక్రమ్ 42, పూరన్ 62 తప్ప ఒక్కరూ మంచి స్కోరు చేయలేదు.