ఆ దేశాల నుంచి విమానాలను ఆపండి : కేజ్రీవాల్​

By udayam on November 27th / 3:05 pm IST

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపధ్యంలో ఒమిక్రాన్​ కొవిడ్​ వేరియంట్​ బయటపడ్డ ఆఫ్రికా దేశాల నుంచి విమానాలను భారత్​కు రాకుండా అడ్డుకోవాలని కేంద్రానికి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్​ విజ్ఞప్తి చేశారు. బి.1.1.529 వేరియంట్​ను అత్యంత ప్రమాదకర వేరియంట్​గా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించినందుకు తక్షణం ఆ దేశాల నుంచి ప్రయాణికుల్ని రాకుండా చేయాలని ఆయన కోరారు. బోట్సువానా, సౌత్​ ఆఫ్రికా, లెసోతో, ఎస్వాటిని, జింబాబ్వే, నమీబియా దేశాల నుంచి ప్రయాణికులపై ఆంక్షలు విధించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్​