న్యూయార్క్ టైమ్స్ కథనం వల్లే సీబీఐ దాడులు : కేజ్రీవాల్

By udayam on August 19th / 5:51 am IST

ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటి పై సీబీఐ సోదాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం పై మాటల దాడికి దిగారు. “దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎడ్యుకేషన్ మోడల్ గురించి ప్రశంసిస్తూ న్యూయార్క్ టైమ్స్ లో కథనం వచ్చిన రోజు నాడే కేంద్రం మనీష్ ఇంటికి సీబీఐని పంపింది” అని ట్వీట్ చేశారు. ప్రపంచమంతా దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్య, ఆరోగ్య మోడల్ గురించి చర్చిస్తుంటే, దీనిని కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని చూస్తోంది. అందుకే అరెస్టులు, సోదాలు నిర్వహిస్తున్నారు” అని అంటూ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ల పై స్పందించిన మంత్రి అనురాగ్ ఠాకూర్ సీబీఐ విచారణలతో ఉన్న భయం వల్లే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా దిల్లీలో అనుసరిస్తున్న ఎడ్యుకేషన్ మోడల్ గురించి మాట్లాడుతూ ట్వీట్ చేశారు” అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్​