కోర్టులో అఫ్తాబ్​: ఆవేశంతోనే హత్య చేశా

By udayam on November 22nd / 11:32 am IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టెలికాలర్​ శ్రద్దా వాకర్​ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్​ అమీన్​ పూనావాల ఈరోజు కోర్టులో తన వాంగ్మూలాన్ని వెల్లించాడు. ఆవేశంలోనే తాను శ్రద్దాను హత్య చేసినట్లు అంగీకరించిన అతడు.. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవ్వడంతో అప్పుడు సరిగ్గా ఏం జరిగిందీ అన్నది తనకు గుర్తు లేదంటున్నాడు. పోలీసుల కస్టడీ గడువు ముగియడంతో అతడిని సాకేత్​ కోర్టు ముందు వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రవేశపెట్టారు. పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని, కేసును తప్పుదోవ పట్టించే ఉద్దేశ్యం లేదని న్యాయమూర్తి ముందు వెల్లడించాడు.

ట్యాగ్స్​