హర్యానా మాజీ సిఎంకు 4 ఏళ్ళ జైలు

By udayam on May 27th / 11:46 am IST

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్​ చౌతాలాకు ఢిల్లీ కోర్ట్​ ఈరోజు 4 ఏళ్ళ కారాగార శిక్షను విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి వికాస్​ దౌల్​ చౌతాలాకు రూ.50 లక్షల జరిమానా సైతం విధించారు. దాంతో పాటు ఆయన పేరిట ఉన్న 4 ప్రాపర్టీస్​ను కూడా సీజ్​ చేయాలని హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించారు. మే 21 నే ఆయనను దోషిగా తేల్చిన కోర్టు ఈరోజు శిక్షను ఖరారు చేసింది. 1993–2006 మధ్య ఆయన ఆదాయం ఏడాదికి రూ.25 వేల నుంచి రూ.1,42,000లకు చేరడంపై ఈ కేసు నమోదైంది.

ట్యాగ్స్​