బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌’ షోపై హైకోర్టు ఆదేశాలు

By udayam on December 30th / 5:47 am IST

బాలకృష్ణ యాంకర్‌గా ‘ఆహా’ ఓటీటీ వేదికపై ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌ షో ఒక రేంజ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో అనధికార ప్రసారాలు, ప్రసారాలను వెంటనే నిలిపివేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘అన్ స్టాపబుల్’ ఎపిసోడ్స్, ప్రోమోలను చాలా మంది షేర్ చేస్తున్నారు. కొన్ని ఎపిసోడ్‌ల షూటింగ్‌లో ఫోటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో వస్తున్నాయి. దీంతో తాము తీవ్రంగా ఆర్థికంగా నష్టపోతున్నామని అర్హ మీడియా వేసిన పిటిషన్ మేరకు ఢిల్లీ హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.

ట్యాగ్స్​