ప్రభుత్వ ప్రకటనలను ఆప్ సొంత ప్రచారం కోసం వినియోగించిందని, వాటికి సంబంధించి రూ.97 కోట్లు చెల్లించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే ఇటువంటి కొత్త ప్రేమలేఖలను జారీ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కి లేదని ఆప్ పేర్కొంది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకటనలు ఇస్తుందని..కేవలం తమ ప్రభుత్వాన్నే బిజెపి లక్ష్యంగా చేసుకుందని ఆప్ విమర్శించింది. ఢిల్లీ ప్రజలను ఇబ్బంది పెట్టేందుకే బిజెపి ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.